RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి

కొనుగోలు కేంద్రాలలో రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి

షాపల్లి , నేమ్మని గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 13 (డిగ్నిటీ న్యూస్): నార్కట్ పల్లి మండలంలోని షాపల్లి, నెమ్మాని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అమ్మిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, సకాలంలో కాంటాలు పూర్తి, రైతు ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు

రైతులు రోజులు తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొన్నది అన్నారు . వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ధాన్యం తడవకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేయాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని కోరారు

Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version