RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

సినీ ప్రపంచం నుంచి రాజకీయ రంగం వరకూ… విజయ్ ప్రయాణం సంచలనం!

చెన్నై, మే 04 (డిగ్నిటి న్యూస్): 1974 జూన్ 22న జన్మించిన జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ (విజయ్) చిన్ననాటి నుంచే సినీ వాతావరణంలో పెరిగారు. ఆయన తండ్రి ఎస్. ఏ. చంద్రశేఖర్ ప్రముఖ దర్శకుడు కాగా, తల్లి శోభా చంద్రశేఖర్ గాయని. దీంతో నటనపై ఆసక్తి సహజంగానే పెరిగింది.చెన్నైలోని ఫాతిమా మ్యాట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తిచేసిన విజయ్, తరువాత లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్‌లో చేరాడు. అయితే నటనపై మక్కువతో చదువును మధ్యలోనే వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.18 ఏళ్ల వయసులో నాలయ్య తీర్పు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్, తన కెరీర్‌లో 60కి పైగా సినిమాల్లో నటించి, దక్షిణ భారతదేశంలో అగ్రనటుడిగా ఎదిగాడు. పొక్కిరి, ఘిల్లి, తుపాకి, మాస్టర్, లియో వంటి చిత్రాలు ఆయనకు భారీ క్రేజ్ తెచ్చాయి. ముఖ్యంగా యువతలో ఆయనకు అపారమైన అభిమానం ఉంది.సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుండే విజయ్, 2009లో విజయ్ మక్కల్ అయ్యక్కం ద్వారా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రజల్లో మంచి పేరు సంపాదించారు.ఇటీవల ఆయన తమిళగ వెట్రి కళగం (టీవీకే పార్టీ)ను స్థాపించి రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ప్రజల సమస్యలపై గళమెత్తుతూ, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఆయన అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.సినీ రంగంలో స్టార్‌డమ్ నుంచి రాజకీయాల్లో ప్రభావం చూపించే నాయకుడిగా మారుతున్న విజయ్ ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version