RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నల్గొండ బస్టాండ్ విస్తరణ పనులకు శంకుస్థాపన

రెండు కొత్త సిటీ బస్సులను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలే లక్ష్యం

నల్గొండ నియోజకవర్గం, జూన్ 24 (డిగ్నిటి న్యూస్):నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునికీకరణ పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బుధవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజల రవాణా అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెండు నూతన సిటీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రయాణికులకు సకల సదుపాయాలు కల్పించాలనే సంకల్పంతో బస్టాండ్ ఆధునికీకరణ పనులను చేపట్టినట్లు తెలిపారు. నగర ప్రజలకు మరింత మెరుగైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.

అత్యంత వైభవంగా జరిగిన ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాపాలన-ప్రగతి నివేదిక జిల్లా ప్రత్యేక అధికారి, ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Gundeboina Venkanna Yadav
Sub Editor
Nalgonda Dist.
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version