RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

బనగానపల్లెలో ‘మీ భూమి-మీ హక్కు’ పాస్‌పుస్తకాల పంపిణీ

  • కొలిమిగుండ్ల నుంచి భారీగా తరలింపు

కొలిమిగుండ్ల, జూలై 9 (డిగ్నిటి న్యూస్ ): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న “మీ భూమి – మీ హక్కు”రైతుల పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని బనగానపల్లెలో మొదటిసారిగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రభుత్వ అధికారిక రాజముద్రతో కూడిన నూతన పాసుపుస్తకాలను రైతులకు అందజేసే ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి కొలిమిగుండ్ల మండలం నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

ముఖ్య విశేషాలు:

  • భారీగా తరలిన రైతులు
  • కొలిమిగుండ్ల మండల అధ్యక్షుడు మూల రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిధిలోని రైతులు, నాయకులు, కార్యకర్తలు భారీ కాన్వాయ్‌తో బనగానపల్లెకు బయలుదేరి వెళ్లారు.

చంద్రబాబు నాయుడు తొలి శ్రీకారం:

కొత్త ప్రభుత్వ విధానం ప్రకారం, వివాద రహితంగా రూపొందించిన ఈ రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ ప్రక్రియను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచే పంపిణీ చేసి ప్రారంభించనున్నారు.

రైతుల్లో హర్షం:

తమ భూములకు పూర్తి భద్రత కల్పించేలా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు అందుతుండటంతో లబ్ధిదారులైన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Bareed Ramamohan
Reporter
Kolimigundla
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version