DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నకిరేకల్‌లో జూన్‌ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ
News

నకిరేకల్‌లో జూన్‌ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ

26 May 2026, 02:38 PM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 26 (డిగ్నిటి న్యూస్): TUWJ (IJU) జిల్లా మహాసభను జూన్‌ 3న నకిరేకల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా నలుమూలల నుంచి జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరై మహాసభను విజయవంతం చేయాలని కోరారు. మహాసభకు ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ కే. శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే. రామ నారాయణ తదితరులు హాజరవుతారని వెల్లడించారు. జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, ఫోటో, వీడియో జర్నలిస్టుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. ఈ నెల 27 సాయంత్రంతో సభ్యత్వ నమోదు ముగుస్తుందని, ఇంకా సభ్యత్వం తీసుకోని వారు సంఘం బాధ్యులను సంప్రదించాలని సూచించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ఇంటి స్థలాలు, హెల్త్‌ కార్డులు, అక్రిడిటేషన్‌ కార్డుల కోసం సంఘం కృషి చేస్తోందన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.