DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
శ్రీశైలం హుండీల్లో రూ.5.28 కోట్ల ఆదాయం
Devotional

శ్రీశైలం హుండీల్లో రూ.5.28 కోట్ల ఆదాయం

26 May 2026, 02:28 PM   |   Dignity News

శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. గత 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల్లో 96.500 గ్రాముల బంగారం, 3.780 కిలోల వెండి లభించాయి. అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హమ్స్, ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీలు కూడా వచ్చాయి. సీసీ కెమెరాల నిఘా, పటిష్ట భద్రత మధ్య లెక్కింపు నిర్వహించారు. ఈ ప్రక్రియను ఈఓ ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షించగా, ధర్మకర్తల మండలి సభ్యురాలు కె.కాంతివర్థిని పాల్గొన్నారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు హుండీల లెక్కింపులో పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.