DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బోడ స్వామికి రెండోసారి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా పగ్గాలు
News

బోడ స్వామికి రెండోసారి కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా పగ్గాలు

23 May 2026, 01:36 PM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్‌గా బోడ స్వామి రెండోసారి నియమితులయ్యారు. ఈ నియామకం నేపథ్యంలో ఆయన శనివారం నల్లగొండలోని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రెండోసారి జిల్లా పగ్గాలు చేపట్టిన బోడ స్వామిని ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి, దళిత విభాగం అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు. తమపై నమ్మకంతో రెండోసారి బాధ్యతలు అప్పగించినందుకు బోడ స్వామి పార్టీ అధిష్ఠానానికి, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.