DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
సంజామలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం
Issues

సంజామలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం

22 May 2026, 09:19 AM   |   Dignity News

సంజామల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్జా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో గ్రామాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి ఆరబోసిన మిరప, వరి ధాన్యం తడిసిపోవడంతో పాటు పలుచోట్ల ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.