DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం
Issues

బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం

22 May 2026, 07:09 AM   |   Dignity News

విరిగిపడిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు

కొలిమిగుండ్ల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బేలుం సింగవరం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ గాలివాన ధాటికి గ్రామంలో పలుచోట్ల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు నేలకూలడంతో పాటు భారీ వృక్షాలు విరిగి రోడ్డుపై పడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థులు కలిసి రోడ్డుపై పడిన చెట్లను తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కాగా, అకాల వర్షం కారణంగా తమ పంటలకు కూడా కొంతమేర నష్టం వాటిల్లిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.