DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి సూచనలు
Health News

వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి సూచనలు

21 May 2026, 04:28 PM   |   Dignity News

1.. నిమ్మరసం: రోజుకు రెండు సార్లు (ఉదయం & మధ్యాహ్నం) తాగితేదాహం తగ్గుతుంది శరీరం చల్లగా ఉంటుందిఆరోగ్యానికి మంచిది.

2. చింతపండు రసం: ప్రతి రోజు ఒక గ్లాస్ చింతపండు రసం నాలుగు మిరియాల పొడి కొంచెం బెల్లం కలిపి తాగితే సన్ స్ట్రోక్ నుంచి రక్షణ కలుగుతుంది, శరీరం చల్లబడుతుంది.

3. కొబ్బరి నీళ్లు: రోజుకు ఒకసారి తాగితే శక్తి ఇస్తుంది శరీర వేడి తగ్గిస్తుంది.

4. పెసరపప్పు జావ: ఉడికించిన పెసరపప్పు జావ తాగితే శరీరానికి చల్లదనం వస్తుంది.

5. బాదామి గోంద్ (Badam Gondh): నీళ్లలో నానబెట్టి తాగితేశరీరం బాగా చల్లబడుతుంది వేసవిలో చాలా మంచిది.

6. ఉసిరికాయ (Amla): రోజుకు 2 ఉసిరికాయలు లేదా జ్యూస్ తీసుకుంటే శరీరానికి చల్లదనం రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

శతావరి (Shatavari): ఉదయం, రాత్రి ఒక్క స్పూన్ తీసుకుంటే శరీర వేడి తగ్గుతుంది బలాన్ని ఇస్తుంది.

8. భూచక్రగడ్డ చూర్ణం నీటితో తీసుకుంటే: శరీరంలో వేడి తగ్గిస్తుంది.

9. పచ్చ కర్పూరం: బటాని పరిమాణంలో తీసుకుంటేBP నియంత్రణకు సహాయపడుతుంది శరీరానికి చల్లదనం.

షర్బత్ (నన్నారి వేరు/రూట్స్): రోజూ తాగితే శరీరానికి కూలింగ్.

సబ్జా గింజలు: నీళ్లలో నానబెట్టి తాగితే శరీరం చల్లగా ఉంటుంది.

నిరుగొబ్బి గింజలు: మజ్జిగ/నీళ్లలో నానబెట్టి తాగితే వేడి తగ్గుతుంది.

13. మట్టికుండ నీళ్లు: ఫ్రిజ్ నీళ్ల కంటే మట్టికుండ నీళ్లు మంచివి సహజంగా చల్లగా ఉంటాయి.

టమాటా జ్యూస్: టమాటా + నిమ్మరసం కలిపి తాగితేశరీరం చల్లబడుతుంది.

దోసకాయ : రోజుకు ఒకటి తింటేశరీరం చల్లగా ఉంటుంది.

దోసకాయ : రోజుకు 100–200 గ్రాములు చల్లదనం ఇస్తుంది.

ఉల్లిపాయ రసం + మజ్జిగ: తక్షణంగా శరీర వేడి తగ్గిస్తుంది.

అన్నం/మిల్లెట్స్ + పెసరపప్పు: మిల్లెట్స్ వేడి పెంచుతాయి 20% పెసరపప్పు కలిపితే వేడి తగ్గుతుంది.

తాటి నీరా : ఉదయం సూర్యోదయం ముందు తాగితే మంచిది తరువాత తాగితే మత్తు వస్తుంది.

తిప్పతీగ / తిప్పసత్తు: శరీరానికి చల్లదనం & శక్తి ఇస్తుంది.

జాగ్రత్తలు: ఎక్కువగా వేడి పెంచే ఆహారాలు తగ్గించండి గోబీ, వంకాయ, చికెన్, ఎక్కువ నాన్‌వెజ్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలీ.నీళ్లు ఎక్కువగా తాగండి సహజమైన కూలింగ్ ఫుడ్స్ తీసుకోండిమట్టికుండ నీళ్లు ఉపయోగించండి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచండి.

మీ డాక్టర్ ఆర్ శ్రీనివాస్

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.