DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
జలదుర్గం జెడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
News

జలదుర్గం జెడ్పీహెచ్‌ఎస్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

20 May 2026, 04:21 PM   |   Dignity News


జలదుర్గం, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమకు నాణ్యమైన విద్య అందించిన ఉపాధ్యాయుల వల్లే ఉన్నత స్థాయిలో ఉన్నామని తెలిపారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, తమ పిల్లలకు మంచి విద్య అందించాలని సూచించారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్‌మాస్టర్ సి.ఎస్. వాసు, రిటైర్డ్ టీచర్ షడ్రక్, ప్రభుదాస్, పీఈటీ జీయర్, నరసింహమూర్తి, గోపాల్, ప్రస్తుత ప్రధానోపాధ్యాయురాలు, క్లర్క్ శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు. విద్యార్థులు సాహిత్య, భారతి, శ్రావణి, హుస్సేన్‌బీ, చాంద్‌బీ, మురళి సత్యనారాయణ, జనార్ధన్, చంద్రప్రకాశ్, నాగరాజు తదితరులు హాజరయ్యారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.