DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మహిళల భద్రతకు శక్తి యాప్ వినియోగించాలి: ఎస్పీ సునీల్ షొరాణ్
News

మహిళల భద్రతకు శక్తి యాప్ వినియోగించాలి: ఎస్పీ సునీల్ షొరాణ్

20 May 2026, 01:39 PM   |   Dignity News

నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ పేర్కొన్నారు. పాణ్యం మండలంలోని RGM ఇంజనీరింగ్ కళాశాలలో “మహిళల సంరక్షణ మా బాధ్యత” అంశంపై గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.విద్యార్థినులు తమ లక్ష్యాలను ముందుగానే నిర్దేశించుకొని కష్టపడి చదివితే విజయాలు సాధించవచ్చని ఎస్పీ సూచించారు. ఆపద సమయంలో వెంటనే పోలీస్ సహాయం పొందేందుకు ప్రతి ఒక్కరూ శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో 112 నెంబర్‌ను వినియోగించాలని తెలిపారు.

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసాలకు గురైతే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎం. జావళి ఆల్ఫోన్స్ మహిళల ఆర్థిక స్వావలంబనే నిజమైన సాధికారతకు మార్గమని చెప్పారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జయరాములు సైబర్ మోసాలపై అవగాహన కల్పించగా, పాణ్యం ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. సదస్సులో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.