DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి
News

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన గద్వాల విజయలక్ష్మి

20 May 2026, 01:23 PM   |   Dignity News


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్):
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన గద్వాల విజయలక్ష్మి బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం జరిగే మహిళా కమిషన్ చైర్‌పర్సన్, సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్‌, సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, వేముల వీరేశం, బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.