DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు
News

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు

13 May 2026, 04:31 PM   |   Dignity News

విత్తన దుకాణాల్లో ఏవో తనిఖీలు

నంద్యాల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని విత్తన దుకాణాలను బుధవారం మండల వ్యవసాయ అధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా దుకాణాల్లోని నిల్వ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, అనుమతి పత్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం పది రకాల పత్తి విత్తన నమూనాలను సేకరించి హెచ్‌టీ పరీక్షలు నిర్వహించగా, అవన్నీ నెగిటివ్‌గా తేలాయి. నిబంధనల ప్రకారం అనుమతి ఉన్న విత్తనాలనే విక్రయించాలని, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. ధరల పట్టికను ప్రదర్శిస్తూ, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని ఏఓ ఆదేశించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.