DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఆకుమల్లలో 15 నుంచి క్రికెట్‌ పోటీలు
News

ఆకుమల్లలో 15 నుంచి క్రికెట్‌ పోటీలు

13 May 2026, 04:02 PM   |   Dignity News

కోయిలకుంట్ల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండలంలోని ఆకుమల్ల గ్రామ పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా ఈ నెల 15 నుంచి టెన్నిస్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైకాపా నాయకులు గౌరిగారి నాగేశ్వర్‌ రెడ్డి, కాసీం బాషా ఆధ్వర్యంలో ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 10,016, ద్వితీయ బహుమతిగా రూ. 5,016 అందజేస్తారు. ఆసక్తి గల జట్లు రూ. 300 ప్రవేశ రుసుము చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. క్రీడాకారులు తమ సొంత ఊరి జట్టు తరపున మాత్రమే ఆడాలని, క్రమశిక్షణ తప్పితే నిర్వాహకుల నిర్ణయమే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు 8179766825 నంబరులో సంప్రదించాలని సూచించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.