DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు
News

బండలాగుడు పోటీలను ప్రారంభించిన తాటికొండ బుగ్గరాముడు

13 May 2026, 03:36 PM   |   Dignity News

వెంగళరెడ్డిపేటలో ఘనంగా ఎద్దుల పోటీలు.. క్రీడాకారులకు శుభాకాంక్షలు

బండిఆత్మకూరు, మే 13 (డిగ్నిటి న్యూస్): గ్రామీణ క్రీడలు పౌరుషానికి, క్రీడా స్ఫూర్తికి నిదర్శనమని టీడీపీ సీనియర్ నాయకులు, నంద్యాల 38వ వార్డు ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు పేర్కొన్నారు. మండలంలోని వెంగళరెడ్డిపేటలో గణపతి, రాములమ్మ, పోతురాజు విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

​ఈ సందర్భంగా బుగ్గరాముడు మాట్లాడుతూ.. పశువులపై మక్కువతో గ్రామీణ సంస్కృతిని కాపాడుతూ ఇలాంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పోటీల్లో పాల్గొన్న ఎద్దుల యజమానులకు ఆయన అభినందనలు తెలిపారు. గ్రామస్థులు తనకు ఘనస్వాగతం పలకడంపై కృతజ్ఞతలు చాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు. ఎద్దుల విన్యాసాలను చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో వెంగళరెడ్డిపేట కోలాహలంగా మారింది.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.