DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
సంజామలలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ దేవర ఉత్సవాలు
Devotional

సంజామలలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ దేవర ఉత్సవాలు

13 May 2026, 01:41 PM   |   Dignity News

ఏళ్ల తరబడి తర్వాత నిర్వహణ.. వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం – బోనాలు, బలిధానాలతో పెద్దమ్మ దేవర ఉత్సవాలు

సంజామల, మే 13 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రం సంజామలలో పెద్దమ్మ దేవర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల విరామం తర్వాత ఈ ఉత్సవాలు జరుగుతుండటంతో పరిసర గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉత్సవాల్లో భాగంగా భక్తులు సంప్రదాయ బోనాలు సమర్పించగా, బలిధాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర భవనాల శాఖామాత్యులు బి.సి. జనార్ధనరెడ్డి సతీమణి బిసి ఇందిరమ్మ హాజరయ్యారు. అలాగే మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పాల్గొని ఉత్సవాలకు శోభ తీసుకొచ్చారు. వారితో పాటు మండల నాయకులు కూడా హాజరయ్యారు.భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకొని ఉత్సవాలు సజావుగా సాగేందుకు కృషి చేసింది.వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మనోకామనలు తీర్చుకోవాలని ప్రార్థించారు. భక్తి పారవశ్యంతో, సంప్రదాయ వైభవంతో ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.