DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బ్యాట్ పట్టిన నంద్యాల కలెక్టర్: విద్యార్థులతో కలిసి సందడి
News

బ్యాట్ పట్టిన నంద్యాల కలెక్టర్: విద్యార్థులతో కలిసి సందడి

13 May 2026, 08:27 AM   |   Dignity News

నంద్యాల గుర్సాలపేటలోని కే.ఎన్.ఎం. మున్సిపల్ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసి పదో తరగతి రెమిడియల్ తరగతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులతో సరదాగా ముచ్చటించిన ఆమె, స్వయంగా బ్యాట్ పట్టి వారితో కలిసి ఆడి విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా ఎండలో ఎక్కువసేపు ఆడవద్దని, చదువుపై శ్రద్ధ పెట్టి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ విద్యార్థులకు ఆప్యాయంగా సూచించారు. కలెక్టర్ ఇలా విద్యార్థులతో సామాన్యురాలిలా కలిసిపోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.