DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం
Devotional

సంజామలలో వైభవంగా పెద్దమ్మ దేవర ప్రారంభం

12 May 2026, 01:33 PM   |   Dignity News

సంజామల, మే 12 (డిగ్నిటి న్యూస్): మండల కేంద్రమైన సంజామలలో మంగళవారం పెద్దమ్మ దేవర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారి విగ్రహాన్ని మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ శాస్త్రీయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, దర్శనం సజావుగా సాగేలా ఉత్సవ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.