DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
జనసేన రాచమడుగు సోదరుల ఆధ్యాత్మిక ముందడుగు
Devotional

జనసేన రాచమడుగు సోదరుల ఆధ్యాత్మిక ముందడుగు

12 May 2026, 10:05 AM   |   Dignity News

భక్తిశ్రద్ధలతో రామకోటి పుస్తకాల పంపిణీ

నంద్యాల, మే 12 (డిగ్నిటి న్యూస్): హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రీరామ నామ స్మరణ మహిమను చాటిచెప్పేలా వీసీ కాలనీలోని శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయంలో జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్ (రాచమడుగు సోదరులు) ఆధ్వర్యంలో రామకోటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

సమాజంలో ధార్మిక చింతన పెరగాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకర్షించింది.రాచమడుగు సోదరులు స్వయంగా ఆలయ చైర్మన్ మయూరి వెంకటరెడ్డిని కలిసి ఈ రామకోటి పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవనశైలి నేటి తరానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. భక్తి మార్గంలో నడవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఇంట్లో రామ నామ జపం ప్రతిధ్వనించాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాలను పంపిణీ చేసినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో రాచమడుగు రాంబాబు, సంజీవ రాయుడు, శేఖర్ తదితరులు పాల్గొని రాచమడుగు సోదరుల ఆధ్యాత్మిక కృషిని అభినందించారు. ఆలయ సిబ్బంది మరియు స్థానిక భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం అత్యంత భక్తిమయ వాతావరణంలో ముగిసింది.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.