DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు
Crime

ఆత్మకూరులో పోలీసుల తనిఖీలు

10 May 2026, 01:56 PM   |   Dignity News

ఆత్మకూరు, మే 10 (డిగ్నిటి న్యూస్): ఆత్మకూరు పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు పట్టణ సీఐ మహేశ్వర్ రెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పలు కాలనీల్లో ముమ్మరంగా సోదాలు చేపట్టారు. ప్రజల భద్రతే ధ్యేయంగా చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పాత నేరస్థులు, రౌడీషీటర్ల నివాసాలను సోదా చేయడంతో పాటు అనుమానితులను విచారించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

అనంతరం స్థానికులతో నిర్వహించిన అవగాహన సదస్సులో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 112 నంబర్లను సంప్రదించాలని, మహిళల రక్షణకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.