DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
పదో తరగతి టాపర్‌కు ఎంపీ శబరి సన్మానం
News

పదో తరగతి టాపర్‌కు ఎంపీ శబరి సన్మానం

10 May 2026, 01:38 PM   |   Dignity News

ముచ్చుమర్రి (పగిడ్యాల), మే 10 (డిగ్నిటి న్యూస్): పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకు సాధించిన విద్యార్థి షేక్ ముర్తుజావలిని నంద్యాల ఎంపీ, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన గౌండ మా భాష కుమారుడైన ముర్తుజావలి, ఇటీవల విడుదలైన ఫలితాల్లో 596 మార్కులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా విద్యార్థి నివాసానికి వెళ్లిన ఎంపీ, అతడికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లోనూ తండ్రి గౌండ పని చేస్తూ కుమారుడిని చదివించడం అభినందనీయమని కొనియాడారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ముర్తుజావలి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.