DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
బుడగ జంగాల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం
Political

బుడగ జంగాల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం

09 May 2026, 04:28 PM   |   Dignity News

బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు

నంద్యాల, మే 9: బుడగ జంగాల చిరకాల వాంఛను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని బేడా బుడగ జంగాల రాష్ట్ర అధికార ప్రతినిధి తాటికొండ బుగ్గరాముడు కొనియాడారు. నంద్యాలలోని 38వ వార్డు వైఎస్సార్ నగర్ టీడీపీ ఇంచార్జి హోదాలో ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. బుడగ జంగాలకు ఎస్సీ పథకాలను వర్తింపజేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది ఈ సామాజిక వర్గ అభివృద్ధికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారని ఈ నిర్ణయంతో మరోసారి రుజువైందని పేర్కొంటూ, బుడగ జంగాల సంక్షేమం కేవలం ఆయనతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సామాజిక వర్గం తరపున ముఖ్యమంత్రికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.