DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
News

అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

08 May 2026, 03:14 PM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 8 (డిగ్నిటీ న్యూస్): అశోక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ భూతం అరుణకుమారి మాట్లాడుతూ ఎవరు ఎంత సంపాదించిన తినేది అన్నమే తింటాం కాబట్టి మనకున్న దాంట్లో ఎంతో కొంత పేదలకు సహాయం చేయాలనీ కోరుతూ క్లాక్ టవర్ సెంటర్ లో పాక నమస్వి పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అన్నారు .

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్ముందు సమాజ సేవలో పేదలకు ఉచితంగా అన్నదానం విద్యా వైద్యం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అశోక్ చారిటబుల్ ట్రస్ట్ మెంబర్స్ చేతి రమాదేవి, కూరెళ్ల ప్రతిభ, అండ్లపురి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.