DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి నివాళి
News

మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి నివాళి

08 May 2026, 03:02 PM   |   Dignity News

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 8 (డిగ్నిటీ న్యూస్): దివంగత బ్రాహ్మణ సంఘం నాయకుడు, శ్రీ వైష్ణవి చారిటబుల్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మంత్రి సునీల్ ప్రథమ వర్ధంతి సంతాప సభ రానా ప్రతాప్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి తెలంగాణ బ్రాహ్మణ సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానాల శ్యాంసుందర్ రావు, ఉపాధ్యక్షులు దేవులపల్లి రంగా రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరి లక్ష్మీనరసింహారావు,కోశాధికారి ఊరె ప్రసాద్ రావు,తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచంపల్లి రమణారావు మాట్లాడుతూ 55 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందిన మంత్రి సునీల్ సేవలు మరువలేనివని, ఆయన మరణం బ్రాహ్మణ సంఘానికి, ట్రస్టుకు తీరని లోటని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలకమర్రి లక్ష్మీనాచార్యులు, గూడా రాజేశ్వరరావు, గూడ జయరాం, చకిలం నర్సింహ రావు,మల్యాల వెంకటేశ్వర్ రావు,దేవులపల్లి అశోక్ కుమార్, గాదే సీతారామ రావు,పోచంపల్లి ప్రమోద్ కుమార్, పోచంపల్లి కమలాకర రావులతో పాటు మంత్రి సునీల్ కుటుంబ సభ్యులు లీలా భాయ్, సౌజన్య, రిత్విక్ పెద్ద సంఖ్యలో బంధుమిత్రులు పాల్గొని అంజలి ఘటించారు.

📰
Chintha YadaiahReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.