DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ
Issues

కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ కమిషనర్ తనిఖీ

08 May 2026, 08:36 AM   |   Dignity News

​నంద్యాల, మే 8 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ కమిషనర్ శేషన్న శుక్రవారం ఉదయం ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు

​మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని ఆదేశించిన కమిషనర్, వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శుభ్రంగా ఉంచాలని సూచించారు.

​ముఖ్యంగా వ్యాపారులు తమ దుకాణాల వద్ద అక్రమంగా రోడ్లపైకి చొచ్చుకు రాకూడదని, దీనివల్ల ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన హెచ్చరించారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా మార్కెట్ సముదాయంలో క్రమశిక్షణ పాటించాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ రహిత మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మార్కెట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని, త్వరలోనే ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న వెల్లడించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.