DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు
News

పండ్ల నిల్వ కేంద్రాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు

07 May 2026, 09:48 AM   |   Dignity News

నంద్యాల, మే 7 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పండ్ల మార్కెట్లలో గురువారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటరాముడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ కావడంతో, పండ్లను మగ్గబెట్టేందుకు వ్యాపారులు అనుసరిస్తున్న పద్ధతులపై ఆయన ఆరా తీశారు. హానికరమైన కాల్షియం కార్బైడ్‌ను వినియోగించకూడదని, దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాపారులను హెచ్చరించారు. పండ్లను సహజ పద్ధతుల్లో లేదా ప్రభుత్వం అనుమతించిన ఎథిలీన్ శాచెట్లను మాత్రమే వినియోగించి మగ్గబెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) నిబంధనలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వినియోగదారుల సంఘం అధ్యక్షులు, అడ్వకేట్ అమీర్ బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.