DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
అక్రమంగా ప్రవేశించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు
News

అక్రమంగా ప్రవేశించి, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు

07 May 2026, 02:24 AM   |   Dignity News

బనగానపల్లి మే 6 (డిగ్నిటి న్యూస్):వైద్య చికిత్స లో నిర్లక్ష్యంగా వ్యవహరించి 9 నెలల పాప మరణానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కొంతమంది వ్యక్తులు బనగానపల్లె టౌన్ లో సురేఖ ఆసుపత్రి లోకి అక్రమంగా ప్రవేశించి, ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేయడం జరిగిందని సిఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జరిగిన సంఘటన పై దాడికి పాల్పడిన వ్యక్తులు మరియు వారిని దాడికి ప్రోత్సహించిన కొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులపై ఆసుపత్రి నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బనగానపల్లె సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. వైద్య సేవలు అందించే ఆసుపత్రులపై నిరాధార ఆరోపణలు చేస్తూ దాడికి పాల్పడటం, ఆసుపత్రి సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేయడం వలన ఆసుపత్రి కి వచ్చిన ఇతర రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతారని, కొన్నిసార్లు పరిస్థితి విషమించి ప్రాణాంతకం కూడా కావచ్చని, కనుక ఎవరైనా ఆసుపత్రి లో సరైన చికిత్స అందలేదని భావిస్తే చట్ట ప్రకారం ఫిర్యాదు చేసి న్యాయం పొందాలి కానీ ఆసుపత్రి పై దాడికి పాల్పడితే, దాడికి పాల్పడిన వారిపై మరియు వారిని ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు మలుసుకోవాలని ఆయన సూచించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.