DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నంద్యాలలో కారు – బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు
Crime

నంద్యాలలో కారు – బైక్ ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు

06 May 2026, 01:33 PM   |   Dignity News

నంద్యాల పట్టణంలోని నవమాన్ ఆర్చ్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవ నగర్ కు చెందిన ఓబులేసు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గోడాన్స్ పక్కల సందు నుండి అతివేగంగా దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో, బాధితుడు ఎగిరి పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. చేయి విరిగి తలకు దెబ్బలు తగిలిన బాధితుడిని స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివాస ప్రాంతాల్లో వాహనాలను వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.