DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు
Political

సాగునీటి ప్రాజెక్టుల జాప్యంపై టీఆర్ఎస్ పోరు

04 May 2026, 04:14 PM   |   Dignity News

హైదరాబాద్‌, మే (డిగ్నిటి న్యూస్): రంగారెడ్డి – పాలమూరు ఎత్తిపోతల పథకం పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈనెల 8న భారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించారు. అనంతరం పాండురంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, రైతాంగ హితం కోరి చేపట్టే ఈ నిరసనలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ‘కొత్త తరం కోసం.. కొత్త స్వరం’ నినాదంతో పార్టీ ఆశయాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్తున్నామని, భవిష్యత్తు రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.