DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
అదరగొట్టావు తంబి…
Political

అదరగొట్టావు తంబి…

04 May 2026, 08:08 AM   |   Dignity News

టీవీకే అధినేత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఇచ్చిన తన మొదటి ఇంటర్వ్యూలో తన రోల్ మోడళ్లలో ఎం. జి. రామచంద్రన్, జె. జయలలిత, ఎం. కరుణానిధి వంటివారు ఉన్నారని పేర్కొన్నడటం విశేషం.. విజయ్ పార్టీని ప్రకటించినప్పుడు అందరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులే ఇప్పుడు నోళ్లు నొక్కుకొనేలా చేశాడు జోసెఫ్ విజయ్….జోసెఫ్ విజయ్ ప్రధానంగా యువత, మహిళల ఓటు బ్యాంకును రాబట్టడంలో సక్సెస్ అయ్యారు.. తమిళనాడులో ఉన్న లక్షలాది మంది అభిమానులు విజయ్ కు ఈ ఎన్నికల్లో అండగా నిలిచారు.. అలా విజయ్ తమిళనాడు ప్రజల నాడిని సులువుగా పట్టాడు. తన మ్యానిఫేస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే కాకుండా, ఏ పార్టీతోనూ కలవకుండా తాను ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించి తన ధైర్యాన్ని చెప్పకనే చెప్పాడు.. ఆ ధైర్యానికి తమిళ తంబిలు ఫిదా అయినట్లే కనిపిస్తుంది… విజయ్ జోసెఫ్ పార్టీ టీవీకే కు వస్తున్న ఆధిక్యత చూస్తుంటే దళపతి మరో ఎంజీఆర్ లా మారినట్లే కనిపిస్తుంది..

📰
Madam YashwanthReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.