– మాల మహానాడు జేఏసీ డిమాండ్
నంద్యాల: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల వ్యవస్థను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు జేఏసీ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. నంద్యాలలోని కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు బండి దేవాంతకుడు, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైసీ పుల్లయ్య మాట్లాడుతూ.. దేశంలోని దళితులు, గిరిజనులు, బీసీలు మరియు మైనార్టీల ఓట్లను విచక్షణారహితంగా తొలగిస్తూ రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కును కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో విఫలమైన సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, బహుజనుల హక్కుల పరిరక్షణకై దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాల మహానాడు ప్రతినిధులు బండి దేవదాసు తదితర నాయకులు పాల్గొన్నారు.
Uncategorized
కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని ఖండిస్తున్నాం
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
