DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
Uncategorized

కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన

13 Oct 2026, 08:32 AM   |   Dignity News

నంద్యాల: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడటాన్ని నిరసిస్తూ మంగళవారం నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ, ఏపీఎమ్‌ఎఫ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పాత్రికేయులపై, ముఖ్యంగా మహిళా జర్నలిస్టులపై పోలీసులు దౌర్జన్యం చేయడం అమానుషమని, జర్నలిస్టుల భద్రతకు తక్షణమే బలమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. వార్తల కవరేజ్ ఎలా చేయాలో పోలీసులు నిర్దేశించడం సరికాదని, అన్యాయాలను ఎండగడుతున్న పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు మౌలాలి, గిరి సాగర్, మస్తాన్, శివరాం, నాగ వర్ధన్ రెడ్డి, శివ కుమార్ రెడ్డిలతో పాటు పెద్ద ఎత్తున పాత్రికేయులు పాల్గొన్నారు.

📰
Chinna MadduletyReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.