కర్నూలు: పేదరికం కారణంగా ఏ ఒక్క చిన్నారి చదువుకు దూరం కాకూడదని, ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకి కాకూడదనే ఆశయంతో కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ (కేడీఎస్ఎస్) డైరెక్టర్ ఫాదర్ తోట జోసెఫ్ అందిస్తున్న సేవలు అభినందనీయంగా నిలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న పేద విద్యార్థుల కుటుంబ పరిస్థితులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారు ఉన్నత విద్యను అభ్యసించేలా అవసరమైన సహాయ సహకారాలను అందిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. చదువు బాలల హక్కు అని, విద్యతోనే పేదరికాన్ని నిర్మూలించవచ్చని విశ్వసించే ఫాదర్ జోసెఫ్.. ఒక విద్యార్థికి చేయూతనందించడం అంటే ఒక కుటుంబానికి వెలుగునిచ్చి సమాజ అభివృద్ధికి పునాది వేయడమేనని పేర్కొన్నారు. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ సమాజంలో సానుకూల మార్పుకు కృషి చేస్తున్న ఆయన సేవా నిరతిని పలువురు కొనియాడుతున్నారు.
Uncategorized
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఫాదర్ తోట జోసెఫ్
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
