DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్
Uncategorized

అభివృద్ధి నివేదికను సీఎంకు అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

11 Oct 2026, 11:51 AM   |   Dignity News

అనంతపురం/ఉరవకొండ, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): ఉరవకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని (ప్రోగ్రెస్ కార్డ్) రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను ఇందులో సమగ్రంగా పొందుపరిచినట్లు మంత్రి వివరించారు. ఉరవకొండ తాగునీటి సదుపాయం, హంద్రీ-నీవా కాలువ వెడల్పు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రామాల్లో సిసి రోడ్లు మరియు నూతన ప్రభుత్వ భవనాల నిర్మాణాల వివరాలను నివేదిక రూపంలో సీఎంకు తెలియజేశారు. నియోజకవర్గంలో మంజూరైన పనులతో పాటు ప్రజలకు చేకూరుతున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు వివరించాలని, ప్రజాప్రతినిధులందరూ ఈ తరహా ప్రోగ్రెస్ కార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. ఉరవకొండ అభివృద్ధికి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తున్న సీఎం చంద్రబాబుకు మంత్రి పయ్యావుల కేశవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.