– వైద్య పరీక్షలు, మందుల పంపిణీ
నంద్యాల, అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): నంద్యాల పట్టణంలోని 15వ వార్డు గిరినాథ్ సెంటర్‌లో అడ్వకేట్ సన్నల సాయిరామరెడ్డి ఆధ్వర్యంలో, కేఎమ్ డెంటల్ కేర్ సౌజన్యంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో దంత వైద్య నిపుణులు ఆదివారం స్థానిక ప్రజలకు దంత పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఎక్స్ రే ద్వారా సమస్యలను వివరించి తగిన చికిత్స సలహాలు అందించారు. అంతేకాకుండా, బాధితులకు ఉచితంగా మౌత్ వాష్, టూత్ పేస్ట్‌లు మరియు మందులను పంపిణీ చేశారు. పెద్ద సమస్యలు ఉన్న వారికి తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. తమ వార్డులో ఉచితంగా సేవలు అందించిన సాయిరామరెడ్డికి మరియు వైద్య బృందానికి స్థానిక ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
Uncategorized
ఉచిత దంత వైద్య శిబిరం
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
