DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
26వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె: సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Uncategorized

26వ రోజుకు చేరిన వీఆర్ఏల నిరవధిక సమ్మె: సమస్యలను వెంటనే పరిష్కరించాలి

11 Oct 2026, 11:22 AM   |   Dignity News

బనగానపల్లె: తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు బనగానపల్లె మండల గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 26వ రోజుకు చేరుకుంది. తెలంగాణ తరహాలో పే స్కేలు అమలు చేయాలని, 70 శాతం ప్రమోషన్లు కల్పించాలని, నామినీ వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని మరియు 60 ఏళ్లు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బనగానపల్లె మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు కె. హరిబాబు, నాయకులు తలారి శ్రీనివాసులు, టి. సుధాకర్, టి. గోపాల్, మధు, చెన్నప్ప, శేషు తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.