నందికొట్కూరు: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని పేద, బడుగు, బలహీన వర్గాలు నివసించే కాలనీలలో సిసి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య, నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 17.50 కోట్ల వ్యయంతో 9.70 కిలోమీటర్ల మేర చేపడుతున్న సిసి రోడ్లు, కల్వర్టుల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. టిఎస్ఎస్ఆర్ నగర్, అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంతం, పటేల్ సెంటర్ నుండి గుడ్డు జున్ను మార్గం, మారుతీ నగర్ మరియు బిఆర్ఆర్ నగర్లలో నూతన రోడ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజల రాకపోకల ఇబ్బందులను తీర్చేందుకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం రూ. 17.50 కోట్ల హైబ్రిడ్ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గుంజుపల్లి భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి, డిఈ నాసిర్, ఏఈ బండారి దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
సిసి రోడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: ఎమ్మెల్యే గిత్త జయసూర్య
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
