DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
నందికొట్కూరులో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు: వైభవంగా శ్రీనివాస కల్యాణం
Uncategorized

నందికొట్కూరులో భక్తిశ్రద్ధలతో దేవీ నవరాత్రి ఉత్సవాలు: వైభవంగా శ్రీనివాస కల్యాణం

11 Oct 2026, 11:22 AM   |   Dignity News

నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అత్యంత కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణ సమీపంలోని బొల్లవరం గ్రామంలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సామాజిక సేవా కార్యకర్త గుజ్జుల గౌరీశ్వర్ నాయుడు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు కనులపండువగా సాగాయి. నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయం, శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం, సుంకుల పరమేశ్వరి ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.