DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
యాగంటి క్షేత్రంలో విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్ పూజలు: ఆలయానికి విరాళం అందజేత
Uncategorized

యాగంటి క్షేత్రంలో విద్యుత్ నియంత్రణ కమిషన్ చైర్మన్ పూజలు: ఆలయానికి విరాళం అందజేత

11 Oct 2026, 11:02 AM   |   Dignity News

యాగంటి (నంద్యాల), అక్టోబర్ 11 (డిగ్నిటి న్యూస్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (APERC) చైర్మన్ పి. వెంకట రమణ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ బండి మౌళీశ్వర్ రెడ్డి, ఈవో పాండురంగా రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని అందజేశారు. అదేవిధంగా, హైదరాబాద్‌కు చెందిన చండ్ర బసవయ్య కుటుంబసభ్యులు స్వామివారి దేవస్థానానికి రూ. 10,116/- విరాళంగా అందజేశారు. విరాళం అందించిన దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.