నంద్యాల: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు ఇతర సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) నంద్యాల జిల్లా కమిటీ ప్రతినిధులు తెలిపారు. అంతకుముందు నిర్ణయించిన ప్రకారం ఈ నెల 12వ తేదీన కలెక్టర్‌ను కలవాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 14కు మార్చినట్లు వెల్లడించారు. ఈ మార్పును గమనించి ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరూ అక్టోబర్ 14వ తేదీన ఉదయం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకోవాలని సంఘం జిల్లా అధ్యక్షుడు జి. మద్దయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. గిరిబాబు సాగర్ విజ్ఞప్తి చేశారు.
Uncategorized
ఏపీడబ్ల్యూజేఎఫ్ చలో కలెక్టరేట్ అక్టోబర్ 14కు వాయిదా
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
