సంజామల: సంజామల మండలంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జనసేన పార్టీ నాయకుడు రాజు ఆందోళన వ్యక్తం చేశారు. సాగునీరు అందక, పంటలు పండక రైతులు ఆర్థికంగా కుదేలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మండలంలో అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన చేయించాలని కోరారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ తగిన నష్టపరిహారం అందించి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సంజామల మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Uncategorized
సంజామల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి: జనసేన నాయకులు రాజు
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
