నంద్యాల: నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సామాజిక ఐక్యత, సాంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మహాలయ అమావాస్యను పురస్కరించుకుని సంఘం ఉపాధ్యక్షుడు సుధీర్ శర్మ బృందం ఆధ్వర్యంలో శనివారం సుమారు 150 మంది పితృదేవతలకు తర్పణాలు వదిలి, వారికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. సంస్కృతీ సాంప్రదాయాలలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం ఎంతో విశిష్టమైనదని, పూర్వీకులను స్మరించుకుంటూ వారి ఆశీస్సులు పొందాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుధీర్ శర్మ తెలిపారు. నంద్యాల చరిత్రలోనే ఇదొక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు, సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Uncategorized
సుధీర్ శర్మ బృందం ఆధ్వర్యంలో 150 మంది పితృదేవతలకు తర్పణాలు
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
