నల్లగొండ: నల్లగొండలోని ఏకలవ్య పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పాఠశాల చైర్మన్ అలుగుబెల్లి కరుణాకర్ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ మారం శ్రీనివాస రెడ్డి మరియు ప్రిన్సిపాల్ హరిప్రసాద్‌లు విద్యార్థుల ప్రతిభను విశేషంగా అభినందించారు. బతుకమ్మ పండుగ విశిష్టతను, తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను ఈ సందర్భంగా విద్యార్థులకు వివరించి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పాఠశాలకు సెలవులను ప్రకటిస్తున్నట్లు యజమాన్యం వెల్లడించింది.
Uncategorized
ఏకలవ్య విద్యార్థుల బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహణ
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
