నంద్యాల: నంద్యాల జిల్లాలో మిగిలిపోయిన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపు కోసం శనివారం ప్రత్యేక గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ తెలిపారు. ఓపెన్ కేటగిరీ కింద సిరివెళ్ల, ఆళ్లగడ్డ రూరల్, బేతంచెర్ల రూరల్, నందికొట్కూరు రూరల్, ఆత్మకూరు మున్సిపాలిటీ, ఆత్మకూరు రూరల్ మరియు కొత్తపల్లి మండలాల్లో మొత్తం 7 షాపులకు (గెజిట్ నంబర్: 155), అలాగే పగిడ్యాల మండలంలో గౌడ కులస్తుల కోసం కేటాయించిన ఒక షాపునకు (గెజిట్ నంబర్: 156) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రాజకీయ లేదా ఇతర ప్రలోభాలకు, అవాస్తవ ప్రచారాలకు లోనుకాకుండా అర్హులంతా పారదర్శకంగా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అక్టోబర్ 21వ తేదీ ఉదయం 8:00 గంటలకు జిల్లా కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా డ్రా తీయనున్నట్లు వెల్లడించారు. సందేహాలు ఉన్నవారు నంద్యాల కలెక్టరేట్ లేదా సమీపంలోని ఎక్సైజ్ స్టేషన్లలో సంప్రదించవచ్చని సూచించారు.
Uncategorized
మిగిలిన మద్యం దుకాణాలకు నూతన గెజిట్ విడుదల: ఎక్సైజ్ శాఖ అధికారి ప్రకటన
ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
