నంద్యాల: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో దేశవ్యాప్తంగా సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారంటూ సీపీఐ, కాంగ్రెస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలోని సంజీవనగర్ సెంటర్లో శనివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ఆయన చిత్రపటం, బ్యానర్లను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లోనే సుమారు 50 వేల మంది ఓటర్లను ఏకపక్షంగా తొలగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. అర్హులైన పౌరుల ఓటు హక్కును కాలరాయడం రాజ్యాంగంపై దాడి చేయడమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చింతలయ్య, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవి, డి. శ్రీనివాసులు, ధనుంజయుడు, జి. హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Uncategorized
ఎస్ఐఆర్ పేరుతో కోట్లాది ఓట్ల తొలగింపు.. కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా చేయాలి
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
