అనంతపురం, అక్టోబర్ 9 (డిగ్నిటి న్యూస్): బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షీరామ్ 20వ వర్ధంతి సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో రాయలసీమ జోన్ స్థాయిలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఎస్ఎస్బీఎన్ కళాశాల వద్ద ఉన్న కాన్షీరామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందనూరు నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం అధ్యక్షత వహించగా, అనంతపురం పార్లమెంట్ ఇన్చార్జ్ బైనేని శ్రీనివాసరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాన్ని, స్వంత ఆస్తులను త్యజించి, సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించి బహుజనులకు రాజకీయ అధికార దిశను చూపించిన మహోన్నత నేత కాన్షీరామ్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడిచి బహుజనులు అధికారాన్ని కైవసం చేసుకున్నప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు గోవిందు, ఓబయ్య, వివిధ జిల్లాల అధ్యక్షులు రామలింగయ్య, గద్దల లాజర్, వినయ్ కుమార్, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల బీఎస్పీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Uncategorized
బహుజనులకు రాజకీయ అధికార దిశను చూపించిన నాయకుడు కాన్షీరామ్
ఈ QR కోడ్ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.
