DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
ఎమ్మెల్యే గౌరు చరితమ్మ హయాంలోనే గ్రామాల అభివృద్ధి: పంట దిలీప్ కుమార్ రెడ్డి
Uncategorized

ఎమ్మెల్యే గౌరు చరితమ్మ హయాంలోనే గ్రామాల అభివృద్ధి: పంట దిలీప్ కుమార్ రెడ్డి

09 Oct 2026, 04:51 AM   |   Dignity News

గడివేముల: టీడీపీ ప్రభుత్వం మరియు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని మండల టీడీపీ అధ్యక్షుడు పంట దిలీప్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని బుజనూరు, గ్రంధివేముల గ్రామాల్లో ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన తాగునీటి ఎద్దడిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, గౌరు కుటుంబ సభ్యులు జిందాల్ (JSW) యాజమాన్యంతో మాట్లాడి రెండు గ్రామాల్లో బోర్లను వేయించారని తెలిపారు. ఈ బోర్లలో 2.5 నుంచి 4 అంగుళాల మేర సమృద్ధిగా నీరు పడటంతో గ్రామాల తాగునీటి సమస్య తీరిందన్నారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు సహకరించిన జిందాల్ యాజమాన్యానికి, గౌరు కుటుంబానికి నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు భాస్కర్, సీనియర్ నాయకులు పంట రామచంద్రారెడ్డి, ఎస్వీ రామమోహన్ రెడ్డి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.