DIGNITY NEWS
తెలుగు దినపత్రిక
జనసేన పార్టీ కార్యాలయంలో కాపునాడు ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్‌కు ఘన సత్కారం
Uncategorized

జనసేన పార్టీ కార్యాలయంలో కాపునాడు ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్‌కు ఘన సత్కారం

08 Oct 2026, 05:12 PM   |   Dignity News

నంద్యాల: జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు దొంతుల కిషోర్ నాయుడిని జనసేన నాయకులు రాచమడుగు చందు, సుందర్‌లు గురువారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా దొంతుల కిషోర్ నాయుడు మాట్లాడుతూ.. నంద్యాలలో రాచమడుగు చందు, సుందర్‌లు తమ సొంత నిధులతో జనసేన పార్టీ కార్యాలయాన్ని నడిపిస్తూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. క్షేత్రస్థాయి నాయకులను ఏకతాటిపైకి తెస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న వారి సేవలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచమడుగు రాంబాబు, రామలింగేశ్వర వరప్రసాద్, సంజీవరాయుడు, కిషోర్ నాయుడు, ఠాగూర్, చంటి, నాగరాజు, శ్రీశైలం నియోజకవర్గం మల్లికార్జున, మారెడ్డి రామయ్య, గురు తదితరులు పాల్గొన్నారు.

📰
CHIRRABOINA RAMA RAO YADAVReporter
QR Code

ఈ QR కోడ్‌ను స్కాన్ చేస్తే ఈ వార్త వెంటనే ఓపెన్ అవుతుంది.