– సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్‌కు అభినందనలు
నల్గొండ: నల్లగొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ‘టీబీ ముక్త్ పంచాయతీ’గా ఎంపికైన రసూల్‌పురం గ్రామపంచాయతీ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్‌ను గురువారం జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మరియు ఇతర ఉన్నతాధికారులు ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు. గ్రామాన్ని క్షయ (టీబీ) రహితంగా తీర్చిదిద్దడంలో సర్పంచ్ మరియు గ్రామ యంత్రాంగం చూపిన చొరవను, చేసిన కృషిని ఈ సందర్భంగా కలెక్టర్ మరియు ఎమ్మెల్సీ ప్రత్యేకంగా అభినందించారు. నిరంతర అవగాహన, వైద్య పరీక్షలు, సమర్థవంతమైన పర్యవేక్షణతోనే ఈ గుర్తింపు సాధ్యమైందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో గ్రామంలో ఆరోగ్య ప్రమాణాలను కాపాడుకుంటూ ఇతర పంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
